మైండ్ బ్లాక్ చేసే పెళ్లి ఆచారాలు.. అవి ఏంటంటే...

 ప్రపంచవ్యాప్తంగా వివాహ సంప్రదాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, దాని సాధారణ ఉద్దేశ్యం ప్రేమ మరియు ఆనందాన్ని వ్యాప్తి చేయడం. ప్రతి దేశం మరియు సంస్కృతికి దాని స్వంత ప్రత్యేకమైన వివాహ ఆచారాలు ఉన్నాయి.   ఈ ఆచారాలు కొన్నిసార్లు ఆశ్చర్యంగానూ, కొన్నిసార్లు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి.  కొన్ని దేశాల్లో పెళ్లిళ్ల ఆచారాలను చూస్తే మైండ్​ బ్లాక్​ అవుతుంది.  వధువుపై నడవడం.. కాల్చడం.. ఏడవడం.. ఇంకా ఏకాంతంగా గడపాల్సిన సమయంలో  వధువు తరపు బంధువులు  ఉండటం వంటి మైండ్​ బ్లాక్​ చేసే వింత ఆచారాలు ఇంకా ప్రపంచంలో కొనసాగుతున్నాయి..  ఇలాంటి వింత ఆచారాలను ఏదేశంలో ఎవరు పాటిస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

వధువుపై ఉమ్మివేయడం 

కెన్యాలోని మాసాయి వివాహంలో పెళ్లి అయిన తరువాత  వధువు తన భర్తతో కలిసి గ్రామాన్ని విడిచిపెట్టే ముందు వధువు తండ్రి సంప్రదాయబద్ధంగా తన కుమార్తె తల .. రొమ్ములపై ​​ఉమ్మి వేస్తాడు. అలాగే, తన కొత్త ఇంటికి వెళుతున్నప్పుడు, వధువు రాయిగా మారుతుందనే నమ్మకంతో వెనక్కి తిరిగి చూసేందుకు అనుమతించబడదు.

 విచిత్రమైన మొదటి రాత్రి

పెళ్లి అయిన తరువాత వ్రతాలు చేసుకుంటారు.  ఆతరువాత సంప్రదాయంగా తొలిరేయి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనదేశంలో అయితే వధూవరులు ఏకాంతంగా ఉంటారు.  కాని  ఆఫ్రికాలోని కొన్ని గ్రామాల్లో తొలిరాత్రి పడకగదిలోకి నవ వధూవరులకు తోడుగా వృద్ధురాలు రావడం ఆనవాయితీ అట.  వధువు ఎలా ప్రవర్తించాలో ..  మొదటి రాత్రి ఏమి చేయాలో నేర్పడానికి ఇది నిర్వహిస్తారట. పూర్వం  మన దేశంలో అయితే  పెళ్లికి ముందు వధువు తరపు బంధువులు ( ఆడవారు) కాని... తల్లికాని వివరిస్తారు.  

బంధువులపై నడవడం

 ఫ్రెంచ్ పాలినేషియాలోని మార్క్వెసాస్ దీవులలో  పెళ్లి తర్వాత, వధువు బంధువులు తమ ముఖాలను మురికిలో పాతిపెట్టి పక్కపక్కనే పడుకోవాలి. వధూవరులు  వారి ముఖాలపై నడిచే ఆచారం ఇంకా కొనసాగిస్తున్నారు. 

వధువును కాల్చే పద్ధతి 

చైనాలోని మైనార్టీలు ఉయిఘర్​ జాతికి చెందిన వారు  వధవును  కాలుస్తారట. వరుడు మొద్దు బారిన బాణంతో మూడుసార్లు కాల్చాలట.  ఆ తరువాత ఆ బాణాలను వరుడు విచ్చిన్నం చేయాలట.  ఆ సమయంలో ఆ పెళ్లి కూతురు పడే బాధను చూసి వరుడి తరపు బంధువులు ఆనందిస్తారట.  

తీవ్రమైన ఏడుపు

 చైనాలోని తుజియన్ జాతి మైనారిటీలు ఈ విచిత్రమైన సంప్రదాయాన్ని కలిగి ఉన్నారు, ఇక్కడ పెళ్లికి ఒక నెల ముందు వధువు ప్రతిరోజూ ఒక గంట పాటు ఏడవాలి. వధువు కుటుంబంలోని చాలా మంది మహిళలు వధువును  ఏడ్చేలా ప్రోత్సహించబడ్డారు, ఈ ఏడుపు సీన్​ లో  10  రోజుల తరువాత తల్లి ... 20 రోజుల తరువాత అమ్మమ్మ  చేరుతారు. అమ్మాయిలు వివిధ టోన్లలో ఏడవడాన్ని ఆనందంగా భావిస్తారట. ఈ ఏడుపు  ఒక రకమైన పాటగా మారుతుంది. 

చీపురు దూకడం

 ఈ సంప్రదాయం అమెరికన్ సౌత్ నుండి ఉద్భవించింది. బానిసత్వం ఉన్న రోజుల్లో నల్లజాతి నవ వధూవరులు చీపురు దూకాల్సి వచ్చేది. ఈ జంట వారి కొత్త జీవితంలో ముందుకు సాగుతున్నట్లు ఇది సూచిస్తుంది.  ఇలా చేశాక కొత్త జీవితంలో వారు సంతోషంగా ఉంటారట. మన దేశంలో చీపురు దాటితే అశుభంగా పరిగణిస్తారు.